డీజీపీపై బొత్స షాకింగ్ కామెంట్స్
పవన్ కళ్యాణ్ కు అంత సీన్ లేదు
విశాఖపట్నం – మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీ డీజీపీ తమ ఫోన్ ఎత్తాలంటే భయపడుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. కడప పర్యటనలో వార్నింగ్ ఇస్తున్న పవన్ కళ్యాణ్ ముందు సెక్యూరిటీ లోపంపై ఏం సమాధానం చెబుతారంటూ ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో కూటమి సర్కార్ ఉందా లేక నిద్ర పోతోందా అంటూ ఎద్దవా చేశారు.
బొత్స సత్య నారాయణ మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. పాలనా పరంగా ఆరు నెలలు పూర్తయినా ఇంకా పట్టు రాలేదన్నారు. చంద్రబాబు మాయ మాటలు చెప్పడంలో దిట్ట అన్నారు.
ఇప్పటికే ప్రజలు కూటమి పాలన పట్ల విసిగి పోయారని, తిరిగి జగన్ మోహన్ రెడ్డినే కావాలని కోరుకుంటున్నారని చెప్పారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఇకనైనా పవన్ కళ్యాణ్ ఒట్టి కబుర్లు చెప్పడం మానుకుంటే మంచిదని హితవు పలికారు.