విశాఖ స్టీల్ ప్లాంట్ పై బాబు..పవన్ నోరు విప్పాలి
డిమాండ్ చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స
విశాఖపట్నం – విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని దానిని ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్ నాథ్. ఆదివారం మీడియాతో మాట్లాడారు.
విశాఖ క్యాంపు కార్యాలయంలో శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ఇవాళ రాష్ట్ర యావత్ ఒక సమస్య పై దృష్టి పెట్టిందని అన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ పై కూటమి ప్రభుత్వ విధానం స్పష్టం చేయాలని అన్నారు . జాతీయంగా ఉంచుతారా లేక ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతారా అన్న దానిపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరు విప్పాలని డిమాండ్ చేశారు.
స్టీల్ ప్లాంట్ తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు ప్రజలకు సంబంధించిందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడు కోవడానికి తాము సిద్దంగా ఉన్నామని, ప్రజా ప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేయడం ఎలాంటి ఉపయోగం లేదన్నారు.
వైసీపీ ప్రభుత్వ హయంలో ప్రైవటీకరణ ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పడంతో కేంద్రం సాహసం చేయలేదన్నారు బొత్స సత్యనారాయణ. ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తమ వల్ల ఆగిందన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో లేదని అప్పులో ఉందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్.