పలకరించుకుంటే తప్పేముంది..?
మాజీ మంత్రి బొత్స సత్య నారాయణ
అమరావతి – మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తన కాళ్లకు మొక్కారంటూ జరుగుతున్న ప్రచారంపై తీవ్రంగా స్పందించారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఎయిర్ పోర్టులో కలుసుకున్నామని, ఒకరికొకరం పలకరించుకున్నామని ఇందులో తప్పేముందంటూ ప్రశ్నించారు. ప్రధానమంత్రి, సీఎంలకు కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు కాళ్లకు మొక్కడం సహజమేనని అన్నారు. కానీ ఈ ప్రచారంతో తనకు సంబంధం లేదన్నారు.
ఇదిలా ఉండగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బొత్స సత్యనారాయణ కాళ్లు మొక్కాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ గా మారింది. దీనిపై రాద్దాంతం చోటు చేసుకోవడంపై స్వయంగా మంత్రి రంగంలోకి దిగారు. ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఇదంతా దుష్ప్రచారం అంటూ కొట్టి పారేశారు. తాను ఎందుకు బొత్స కాళ్లు మొక్కుతానంటూ నిలదీశారు. ఇదంతా కావాలని కొందరు చేస్తున్న కుట్ర అంటూ ఏకి పారేశారు. పార్టీలు వేరైనా ఎదురు పడినప్పుడు ఒకరినొకరం పలకరించు కోవడం సహజమేనని అన్నారు. అందరితో పాటు తాను కూడా బొత్సకు విష్ చేశానని, కానీ కాళ్లు మొక్కలేదని ప్రకటించారు కొండపల్లి శ్రీనివాస్.