జకియా ఖానం మా పార్టీలో లేరు – బొత్స
ఆమెపై ఆరోపణలు వ్యక్తిగతం
అమరావతి – వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఎమ్మెల్సీ జకియా ఖానంపై టీటీడీ వీఐపీ దర్శన టికెట్లను అమ్ముకుందని, రూ. 65 వేలు తీసుకుందని , విచారణలో వెల్లడైందని, అందుకే కేసు నమోదు చేసినట్లు ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది.
ఓ భక్తుడు తన నుంచి జకియా ఖానం ఈ డబ్బులు తీసుకుందని ఆరోపించారు. దీనిపై టీటీడీ ఈవో విచారణకు ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగింది టీటీడీ విజిలెన్స్ వింగ్ రంగంలోకి దిగింది. భక్తుడు చేసిన ఆరోపణలు నిజమని తేల్చింది.
దీంతో ఇవాళ ఎమ్మెల్సీ జకియా ఖానంతో పాటు ఆమె కు చెందిన పీఆర్ఓ, మరొకరిపై కేసు నమోదు చేసింది. అయితే ఆమె వైసీపికి చెందిన ఎమ్మెల్సీ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై తీవ్రంగా స్పందించారు మాజీ మంత్రి, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఆయన మీడియాతో మాట్లాడారు.
వీఐపీ దర్శన టికెట్లు బ్లాక్ లో అమ్ముకున్నట్లు ఫిర్యాదు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ జకియా ఖానంతో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ విషయాన్ని తమ పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కూటమి పవర్ లోకి వచ్చాక జకియా టీడీపీలోకి జంప్ అయ్యిందన్నారు . మంత్రి లోకేష్ తో భేటీ అయిన విషయంపై కూడా ఆయన గుర్తు చేశారు.