మళ్లీ జగనే సీఎం – బొత్స
భారీ మెజారిటీ పక్కా
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ చరిత్ర సృష్టించ బోతోందని స్పష్టం చేశారు ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. పోలింగ్ ముగిసిందని, ఇక ఫలితాలు వెల్లడి కావడం మాత్రమే మిగిలి ఉందన్నారు. తాము మరోసారి అధికారంలోకి రాబోతున్నామని, మ్యాజిక్ ఫిగర్ ను దాటేస్తామని స్పష్టం చేశారు.
శుక్రవారం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ బాస్, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రెండోసారి ముచ్చటగా పదవీ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
జూన్ 9న జగన్ రెడ్డి విశాఖ వేదికగా అంగరంగ వైభవంగా ప్రమాణం చేస్తారన్నారు. ప్రజలు తమ నాయకుడిపై నమ్మకం ఉంచారని, అందుకే భారీ ఎత్తున పోలింగ్ లో పాల్గొన్నారని చెప్పారు బొత్స సత్యనారాయణ.
ఆనాడు దివంగల సీఎంలు నందమూరి తారక రామారావు, సందింటి రాజశేఖర్ రెడ్డిల హయాంలో వచ్చిన పాజిటివ్ వైబ్రేషన్స్ ఇప్పుడు జగన్ హయాంలో కనిపిస్తున్నాయని చెప్పారు. ఇక టీడీపీ కూటమి చాప సర్దు కోవాల్సిందేనంటూ పేర్కొన్నారు.