స్పప్టం చేసిన మాజీ మంత్రి బొత్స
విజయవాడ – ఏపీ శాసన మండలి పక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకున్న వరదల కారణంగా నష్ట పోయిన బాధితులను ఆదుకునేందుకు తమ పార్టీ సిద్దంగా ఉందని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
అధికారంలో ఉన్న టీడీపీ కూటమి నేతలు పనిగట్టుకుని తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు బొత్స సత్యనారాయణ. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు డబ్బులు ఇస్తేనే సాయం చేసినట్టు కాదని అన్నారు.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీకి విస్తృతమైన క్యాడర్ , నెట్ వర్క్ ఉందన్నారు. ఆ విషయం తెలుసు కోకుండా అవాకులు చెవాకులు పేలడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు బొత్స సత్యనారాయణ.
విజయవాడ వరద భాధితులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే తమ పార్టీ బాస్, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రూ. కోటి విరాళంగా ప్రకటించారని తెలిపారు. మిగతా నేతలు కూడా తమకు తోచిన రీతిలో సాయం చేస్తున్నారని చెప్పారు బొత్స సత్యనారాయణ.
వరద ముంపు ప్రాంతాల్లోని సుమారు 50 వేలు కుటుంబాలకు వైస్సార్సీపీ పార్టీ తరుపున నిత్య అవసర సరుకుల పంపిణీ ఇవాల్టి నుంచి ప్రారంభించడం జరుగుతుందన్నారు .