నిప్పులు చెరిగిన మాజీ మంత్రి బొత్స
విశాఖపట్నం – మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటం తప్పా చేసింది ఏమీ లేదన్నారు. చంద్రబాబు నాయుడు తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడని, జనం సమస్యలను గాలికి వదిలి వేశాడంటూ మండిపడ్డారు. ఏం ఉద్దరించారని దావోస్ పర్యటనకు వెళ్లారో చెప్పాలన్నారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. ప్రజలు ఛీ కొట్టే రోజు తప్పకుండా వస్తుందన్నారు.
ఇకనైనా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు. కూటమిలో ఆధిపత్య పోరు నడుస్తోందన్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారని ఇక ప్రజలకు ఏం పనులు చేసి పెడతారంటూ ఎద్దేవా చేశారు.
దేశంలోనే అత్యధిక ఆస్తులు ఉన్న సీఎంలలో చంద్రబాబు నాయుడు నెంబర్ వన్ గా తేలాడని, ఆయన ఏం కష్టం చేసి సంపాదించాడో ప్రజలకు చెబితే నేర్చుకుంటారని అన్నారు బొత్స సత్యనారాయణ. విజన్ పేరుతో ఎన్నిసార్లు మోసం చేస్తారంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు చేతకాని పాలన కారణంగానే తిరుపతిలో ఘటన చోటు చేసుకుందన్నారు. దీనికి బాబే బాధ్యత వహించాలన్నారు.