దమ్ముంటే విచారణ చేపట్టండి
అమరావతి – ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. మంత్రి కొల్లు రవీంద్ర చేసిన ఆరోపణలపై భగ్గుమన్నారు. శాసన మండలిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైల్స్ తగుల బెట్టినట్లు రుజువు చూపించాలని డిమాండ్ చేశారు. తప్పులు జరిగినట్లు భావిస్తే విచారణ చేపట్టాలన్నారు. మంత్రి చేసిన కామెంట్స్ అన్నీ అబద్దాలేనని పేర్కొన్నారు. ఆయన చేసిన ఆరోపణలను రికార్డ్స్ నుంచి తొలగించాలని అన్నారు బొత్స సత్యనారాయణ.
శాసన మండలిలో మంగళవారం మాట్లాడారు ఎమ్మెల్సీ, మాజీ మంత్రి. కూటమి ప్రభుత్వం కావాలని తమను టార్గెట్ చేయడం మంచి పద్దతి కాదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. దమ్ముంటే తాము చేసిన ఆరోపణలపై విచారణ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. తాము అమలు చేసినన్ని సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను దేశంలో ఎక్కడా అమలు చేసిన దాఖలాలు లేవన్నారు బొత్స సత్యనారాయణ. తాము రెడీగా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు బొత్స సత్యనారాయణ.