జగన్ లీడర్ బాబు ప్రొవైడర్
మంత్రి బొత్స సత్యనారాయణ
విశాఖపట్టణం – రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ రెడ్డి లీడర్ అని చంద్రబాబు ప్రొవైడర్ అంటూ ఎద్దేవా చేశారు. ఇద్దరి మధ్య వ్యత్యాసం తెలుసు కోకుండా అవాకులు పేలితే ఎలా అని ప్రశ్నించారు.
ఏదైనా ఆధారాలతో మాట్లాడాలని సూచించారు పీకేకు. చంద్రబాబు మీద అంత ప్రేమ ఉంటే ముందు ఐ ప్యాక్ కు తాళం వేసుకో అంటూ సూచించారు బొత్స సత్యనారాయణ. మేనేజ్‌మెంట్, మోసం, వెన్నుపోటు, బ్రోకరిజం బాబు మార్క్ రాజకీయం అంటూ ఎద్దేవా చేశారు.
పురందేశ్వరి బుర్రను చంద్రబాబు మేనేజ్ చేస్తున్నాడేమో అంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల ఆత్మస్థైర్యం దెబ్బ తినేలా ఎందుకిలా చెత్త రాతలు రాయడం ఏంటి అంటూ రామోజీ రావును ఏకి పారేశారు. పోనీ ఎన్నికల నిర్వహణను మార్గదర్శి మేనేజర్లకు అప్పగించాలా , అదే నీ కోరికైతే చెప్పు ఈసీకి విన్నవిస్తామన్నారు.
దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో గత ఐదేళ్లల్లో అన్ని రంగాల్లోనూ ముందుందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగం ఇలా అన్ని రంగాల్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. విద్యలో ఇవాళ ఏపీ కేరళను అధిగమించిన సంగతి మరిచి పోతే ఎలా అని ప్రశాంత్ కిషోర్ ను ఏకి పారేశారు బొత్స. పీకేవీ ప్యాకేజీ మాటలంటూ సంచలన ఆరోపణలు చేశారు.