NEWSANDHRA PRADESH

కూట‌మి నిర్వాకం బొత్స ఆగ్ర‌హం

Share it with your family & friends

రిజైన్ చేస్తున్న‌ట్టు దొంగ లేఖ త‌యారు

విశాఖ‌ప‌ట్ట‌ణం – రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న త‌న స‌తీమణితో క‌లిసి మీడియాతో మాట్లాడారు. తాను రాజీనామా చేస్తున్న‌ట్టు టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి దొంగ లేఖ సృష్టించార‌ని ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఇలాంటి చిల్ల‌ర రాజ‌కీయాలు చేయ‌డం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.

తాము ఎప్పుడూ ఓడి పోయిన దాఖ‌లాలు లేవ‌న్నారు. పార్టీ ప‌వ‌ర్ లో ఉన్న స‌మ‌యంలో ప‌రాజ‌యం పాలైన ఘ‌ట‌న లేద‌న్నారు. ముందు వెనుకా తెలుసు కోకుండా నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు.

నేను రాజీనామా చేస్తున్న‌ట్టు జ‌నంలో దుష్ప్రచారం చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాను ప్ర‌జ‌ల కోసం ప‌ని చేసే నాయ‌కుడిన‌ని , త‌న‌ను ఎవ‌రూ ఓడించ లేరంటూ బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్ర‌క‌టించారు. కూట‌మి దిగ‌జారుడు రాజ‌కీయాల‌కు ఒక ప‌రాకాష్ట‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు. ఆరు నూరైనా తాము మ‌రోసారి ప‌వ‌ర్ లోకి వ‌స్తున్నామ‌ని చెప్పారు .