బాయ్ కాట్ జియో వైరల్
బీఎస్ఎన్ఎల్ వాడండి
న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా రిలయన్స్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ జియోపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. యూజర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఇష్టానుసారంగా టారిఫ్ లను పెంచుకుంటూ పోతోంది.
తాజాగా భారీ ఎత్తున 29 శాతానికి పైగా ఇప్పుడు ఉన్న ప్లాన్స్ ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో జియో కస్టమర్లు లబో దిబోమంటున్నారు. తొలుత ఫ్రీగా అలవాటు చేసి, ఇప్పుడు డేటా వినియోగించకుండా ఉండలేని స్థితికి తీసుకు వచ్చేలా చేసింది రిలయన్స్ జియో.
ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. బాయ్ కాట్ జియో హ్యాష్ ట్యాగ్ పేరుతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. లక్షలాది మంది షేర్ చేస్తున్నారు. అంబానీ తన కొడుకు పెళ్లి సందర్బంగా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ వచ్చాడు.
విచిత్రం ఏమిటంటే తన కోడలు, కొడుక్కి బంగారంతో తయారు చేసిన వాటిని తొడిగించాడు. ఇదంతా ప్రజల సొమ్మేనంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే జియోకు మంగళం పాడాలని , భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ను ఉపయోగించాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని ధ్రువ్ రాఠీ పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం విశేషం.