కాంగ్రెస్ ప్రభుత్వం హామీల నాటకం
ఓట్లు దండుకునేందుకే ప్రయత్నం
హైదరాబాద్ – బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్లు దండుకునేందుకే ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేశారంటూ ధ్వజమెత్తారు. హామీల అమలుకు వెంటనే జీవోను జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అన్నీ అబద్దాలు చెప్పారని ఒక్కటంటే నిజం చెప్పలేదన్నారు .
కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలం పోరుమల్లలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా బోయినపల్లి మాట్లాడారు. ఈసారి కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో లేరన్నారు. వంద రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
యాసంగి పంటకు ఏప్రిల్, మే నెలల్లో రూ. 500 బోనస్ గా ఇవ్వాలని అన్నారు. ఎన్నికల కోడ్ పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దన్నారు మాజీ ఎంపీ. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసే ఛాన్స్ ఉందన్నారు. ఈ తరుణంలో జనం చెవుల్లో పూలు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు .