ENTERTAINMENT

రామోజీ రావు వ్య‌క్తి కాదు శ‌క్తి

Share it with your family & friends

తెలిపిన బ్రహ్మానందం సంతాపం

హైద‌రాబాద్ – రామోజీరావు మృతి చెంద‌డం ప‌ట్ల సంతాపం వ్య‌క్తం చేశారు ప్ర‌ముఖ న‌టుడు బ్ర‌హ్మానందం. శ‌నివారం రామోజీ భౌతిక కాయానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. అనంత‌రం బ్ర‌హ్మానందం మీడియాతో మాట్లాడారు. రామోజీ రావు వ్య‌క్తి కాద‌ని ఆయ‌న శ‌క్తి అని కొనియాడారు. ఆయ‌న మ‌ర‌ణం యావ‌త్ తెలుగు ప్ర‌పంచానికి తీర‌ని లోటు అని పేర్కొన్నారు.

రామోజీ సంస్థ‌ల చైర్మ‌న్ రామోజీరావు పూర్తి పేరు చెరుకూరి రామ‌య్య‌. ఆయ‌న త‌ర్వాత రామోజీరావుగా మార్చుకున్నారు. 1974లో ఈనాడు ప‌త్రిక‌ను విశాఖ ప‌ట్ట‌ణంలో ప్ర‌ముఖ పాత్రికేయుడు , సంపాద‌కుడు ఏబీకే ప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలో ప్రారంభించారు.

చెరుకూరి రామోజీ రావు స్వ‌స్థ‌లం ఆంధ్ర‌ప్రేద‌శ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా. 16 న‌వంబ‌ర్ 1936లో పుట్టారు. శ‌నివారం తెల్ల వారుజుమున హైదరాబాద్ లో క‌న్ను మూశారు. భార‌త దేశంలో మీడియా మొఘ‌ల్ గా పేరు పొందారు.

వ్యాపార‌, వాణిజ్య వేత్త‌గా రాణించారు. రామోజీ సంస్థ‌ల‌ను ఏర్పాటు చేయ‌డ‌మే కాకుండా వాటిని విజ‌య‌వంతంగా న‌డిపించారు. ప్ర‌పంచంలోనే అతి పెద్ద చ‌ల‌న చిత్ర నిర్మాణ సంస్థ రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించారు.

ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ నెట్‌వర్క్ ఆఫ్ టీవీ ఛానెల్‌లు, చలనచిత్ర నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్ ఉన్నాయి. ఇతర వ్యాపారాలలో మార్గదర్శి చిట్ ఫండ్, డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, కళాంజలి షాపింగ్ మాల్, ప్రియా పికిల్స్, మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయి.

రామోజీరావు కు నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్, ఐదు నంది అవార్డులతో పాటు జాతీయ స్థాయిలో పుర‌స్కారాలు పొందారు. ఆయ‌న చేసిన సేవ‌ల‌కు గాను భార‌త ప్ర‌భుత్వం అత్యున్న‌త పౌర అవార్డు ప‌ద్మ విభూష‌ణ్ పొందారు.