నా నట వారసుడు తనేనంటూ కితాబు
హైదరాబాద్ – ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన వారసుడు వెన్నెల కిషోర్ అంటూ కితాబు ఇచ్చారు. తన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన బ్రహ్మ ఆనందం చిత్రం టీజర్ రిలీజ్ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కిషోర్ ను చూస్తే చాలు వెంటనే నవ్వు వస్తుందన్నారు బ్రహ్మి. తనకు నచ్చిన పాత్రలు ఈ మధ్య రావడం లేదన్నాడు. అందుకే కొంత గ్యాప్ వచ్చిందన్నాడు.
బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ నటించిన బ్రహ్మ ఆనందం మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు బ్రహ్మానందం. వచ్చే నెల ఫిబ్రవరి 14న సినిమాను విడుదల చేస్తామన్నారు మూవీ మేకర్స్.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎందరో కమెడియన్లు ఉన్నారని, కానీ అందరి కంటే భిన్నంగా నటించే సత్తా మాత్రం వెన్నెల కిషోర్ కు మాత్రమే ఉందంటూ కితాబు ఇచ్చారు హాస్య నట బ్రహ్మ బ్రహ్మానందం. నటన అనేది వరమని, అది అందరికీ అబ్బదన్నారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నటిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.