NEWSANDHRA PRADESH

నారా లోకేష్ కు ప్ర‌జా మ‌ద్ధ‌తు

Share it with your family & friends

చంద్ర‌బాబు కుటుంబ స‌భ్యులు

మంగ‌ళ‌గ‌రి – రాష్ట్రంలో జ‌రుగుతున్న ఎన్నిక‌లు నీతికి, అవినీతికి మ‌ధ్య జ‌రుగుతున్న పోరాట‌మ‌ని పేర్కొన్నారు చంద్ర‌బాబు కుటుంబీకులు. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యేగా బ‌రిలో ఉన్నారు నారా లోకేష్ . ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు ఆయ‌న భార్య , హెరిటేజ్ సంస్థ‌ల ఎండీ నారా బ్రాహ్మ‌ణి.

అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను క‌లుసుకుంటూ వారి స‌మ‌స్య‌లు వింటున్నారు. తాము అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని, వ‌చ్చిన వెంట‌నే మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గాన్ని దేశానికే ఆద‌ర్శ ప్రాయంగా మారుస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

నియోజ‌క‌వ‌ర్గం రూపు రేఖ‌లు పూర్తిగా మారుస్తామ‌ని అన్నారు నారా బ్రాహ్మ‌ణి. త‌న మామ చంద్ర‌బాబు నాయుడు అపార‌మైన రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన నాయ‌కుడ‌ని కొనియాడారు. ఆయ‌న‌కు గొప్ప విజ‌న్ ఉంద‌న్నారు.

త‌న మామ సూచ‌న‌లు, స‌ల‌హాలు, మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో మంగ‌ళగిరి నియోజ‌క‌వ‌ర్గాన్ని ఇండియాలోనే టాప్ గా ఉండేలా కృషి చేస్తామ‌న్నారు నారా బ్రాహ్మ‌ణి.