స్త్రీ శక్తి పథకం స్పూర్తి దాయకం
నారా లోకేష్ భార్య బ్రాహ్మణి నారా
గుంటూరు జిల్లా – హెరిటేజ్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్, నారా లోకేష్ భార్య , బాలయ్య కూతురు నారా బ్రాహ్మణి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ తన భర్త మంగళగిరి నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఈ సందర్బంగా తను గత పాలనలో ప్రవేశ పెట్టిన స్త్రీ శక్తి పథకం గురించి ప్రశంసలు కురిపించారు. ఈ స్కీమ్ ద్వారా మహిళలు తమ కాళ్ల మీద నిలబడడం తనను సంతోషానికి గురి చేసిందన్నారు నారా బ్రాహ్మణి.
ప్రధానంగా స్త్రీశక్తి, మహిళా మిత్ర, డ్వాక్రా సంఘాల మహిళలతో సమావేశం కావడం బాగుందన్నారు. నారా లోకేష్ మహిళా సాధికారతకు ప్రవేశ పెట్టిన స్త్రీ శక్తి పథకం లబ్ధిదారులతో మాట్లాడడం మరింత స్పూర్తిని తనలో నింపిందన్నారు నారా బ్రాహ్మణి.
ఎందుకంటే తనకంటే ఎక్కువగా మహిళల్లో ఆత్మ విశ్వాసాన్ని చూశానని చెప్పారు . అనంతరం మంగళగిరిలో కూరగాయల మార్కెట్ ను సందర్శించారు. అక్కడి వ్యాపారులు, ప్రజలు వారి సమస్యలు వివరించారు. అందరి ప్రభుత్వం త్వరలో వస్తుందని, సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని భరోసా ఇచ్చారు బ్రాహ్మణి.