ANDHRA PRADESHNEWS

మంగ‌ళ‌గిరిని గోల్డెన్ హ‌బ్ చేస్తాం

Share it with your family & friends

నారా లోకేష్ భార్య బ్రాహ్మ‌ణి నారా

మంగ‌ళ‌గిరి – రాష్ట్రంలో తెల‌గుదేశం పార్టీ కూట‌మి అధికారంలోకి రాబోతోంద‌ని స్ప‌ష్టం చేశారు నారా లోకేష్ భార్య , హెరిటేజ్ సంస్థ‌ల మేనేజింగ్ డైరెక్ట‌ర్ బ్రాహ్మ‌ణి నారా. మంగ‌ళ‌వారం త‌న భ‌ర్త లోకేష్ ను గెలిపించాల‌ని కోరుతూ ఎన్నిక‌ల ప్ర‌చారం చేప‌ట్టారు. ఆమె ఇంటింటి ప్ర‌చారం చేప‌ట్టారు. కార్మికులు, క‌ర్ష‌కులు, విశ్వ బ్రాహ్మ‌ణుల‌ను, స్వ‌ర్ణ కారుల‌ను క‌లుసుకున్నారు. వారితో చాలా సేపు మాట్లాడారు. వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు.

జ‌గన్ రెడ్డి రాచ‌రిక పాల‌న‌కు చ‌ర‌మ గీతం పాడాల‌ని పిలుపునిచ్చారు. నారా లోకేష్ త‌ప్ప‌కుండా ఈసారి గెలుస్తార‌ని అన్నారు. కూట‌మి స‌ర్కార్ రాక త‌ప్ప‌ద‌న్నారు. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గాన్ని గోల్డెన్ హ‌బ్ గా తీర్చిదిద్దుతామ‌ని చెప్పారు నారా బ్రాహ్మ‌ణి.

ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో వ్యాపారాలు, వృత్తులు ఎంత దారుణంగా దెబ్బ‌తిన్నాయో క్షేత్ర‌స్థాయిలో చూసి తెలుసుకున్నాన‌ని పేర్కొన్నారు. మంగళగిరిలో చేనేతకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తోన్న లోకేష్ గారికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరాను. విజయ పచ్చళ్ల తయారీ కేంద్రాన్ని సంద‌ర్శించి వారితో మాట్లాడారు. ప‌ట్ట‌ణంలో వివిధ వ‌ర్గాల‌ను క‌లిసి వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు బ్రాహ్మ‌ణి నారా.