NEWSNATIONAL

మ‌ల్ల యోధులు హీరోలు కాదు – బ్రిజ్ భూష‌ణ్‌

Share it with your family & friends

బీజేపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్

ఢిల్లీ – భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా హ‌ర్యానా రాష్ట్రంలో జ‌రిగిన శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. మ‌రోసారి కాషాయ జెండా ఎగ‌ర‌నుంది. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌నుంది.

ఈ సంద‌ర్బంగా భార‌త రెజ్ల‌ర్స్ స‌మాఖ్య చీఫ్ , ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై స్పందించారు. త‌న‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌డ‌మే కాకుండా కేసు న‌మోదు చేసిన భార‌త మాజీ రెజ్ల‌ర్ వినేష్ ఫోగ‌ట్ 6 వేల పై చిలుకు ఓట్ల తేడాతో బీజేపీ, ఆప్ అభ్య‌ర్థుల‌ను ఓడించి విస్తు పోయేలా చేశారు.

ఆమె గ‌త సెప్టెంబ‌ర్ 6న కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఈ విజ‌యం హ‌ర్యానా ప్ర‌జ‌లు, రైతుల‌కు అంకితం అని ప్ర‌క‌టించారు. ఇదిలా ఉండ‌గా

“రైతులు, మల్లయోధుల నిరసనల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించారు, గెలిచిన మల్లయోధులు హీరోలు కాదు, విలన్లు. వినేష్ గెలిస్తే మంచిది, కానీ కాంగ్రెస్ నాశనం చేయబడింది అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్.