కాంగ్రెస్ లో మా బావ సీఎం అయ్యేటోడు
వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కామెంట్స్
అమరావతి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి భర్త బ్రదర్ అనిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన కుటుంబంలోని ఆస్తుల తగాదాలు రచ్చకెక్కాయి. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. స్వంత కొడుకు , మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి తన భార్య భారతీ రెడ్డితో కలిసి తల్లి విజయమ్మ, చెల్లెలు వైఎస్ షర్మిలపై కేసు వేశారు. ఇది తెలుగు వారిని విస్తు పోయేలా చేసింది.
ఇప్పటికే తాను రూ. 200 కోట్లు ఆస్తుల వాటా కింద తన చెల్లెలు వైఎస్ షర్మిలకు ఇచ్చానని, ఇక ఆస్తులలో వాటాలు ఇవ్వబోనంటూ ప్రకటించారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ స్పష్టం చేశారు జగన్ రెడ్డి. తన చెల్లెలు అమాయకురాలని, ఆమె వెనుక టీడీపీ చీఫ్ , ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉన్నారని ఆరోపించారు.
దీనిపై తీవ్రంగా స్పందించారు వైఎస్ షర్మిల. తన సోదరుడు జగన్ రెడ్డిని ఏకి పారేశారు. ఎవరైనా కుటుంబ ఆస్తులకు సంబంధించి లోపల మాట్లాడుకుంటారని, కానీ ఇలా చెల్లెలు, తల్లిపై కేసులు వేయరు కదా అని ప్రశ్నించారు .
దీంతో వైసీపీ నాయకులు విజయ సాయి రెడ్డి, పేర్ని నాని, వైవీ సుబ్బా రెడ్డి , తదితరులు పెద్ద ఎత్తున షర్మిల ను టార్గెట్ చేశారు. ఈ తరుణంలో ఉన్నట్టుండి షర్మిల భర్త అనిల్ కుమార్ లైమ్ లైట్ లోకి వచ్చారు. తన బావ మాజీ సీఎం జగన్ రెడ్డి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో గనుక ఉంటే సీఎం అయ్యే వారని అన్నారు. ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.