రేవంత్ రెడ్డి అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు
ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేత మన్నె శశాంక్
ఢిల్లీ – సీఎం రేవంత్ రెడ్డి అల్లుడి కంపెనీ మీద పూర్తి ఆధారాలతో ఈడీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్. అల్లుడైన గొలుగూరి సత్య నారాయణ మాక్సిబిన్ ఫార్మా కంపెనీపై ఆధారాలను సమర్పించినట్లు పేర్కొన్నారు. మాక్సిబెన్ ఫార్మా సంస్థలో రేవంత్ అల్లుడు డైరెక్టర్ గా 16 లక్షల షేర్లు ఉన్నాయని, అదే సంస్థలో మరో డైరెక్టర్ గా ఉన్న అన్నం శరత్ కు 21 లక్షల షేర్లు ఉన్నాయని ఆరోపించారు .
వీరు ఏర్పాటు చేసిన ఒక ప్రైవేట్ ఆస్పత్రిని వరంగల్ లో ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లడం పై పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. రేవంత్ అల్లుడి కుటుంబంపై ఇప్పటికే ఈడీలో కేసులు నమోదయ్యాయని చెప్పారు.
విచారణలో భాగంగా ఈడీ గొలుగూరి రామకృష్ణ ను ముద్దయిగా చేర్చి కోట్ల రూపాయల బ్యాంక్ కుంభకోణానికి పాల్పడ్డారని, ఈ నిధులను ఇతర కుటుంబ సభ్యులకు, ఇతర వ్యాపారాలకు తరలించారని ఈడి ఒక ప్రకటనలో పేర్కొన్న విషయం ఈ సందర్భంగా గుర్తు చేశారు.
గోలుగూరి రామకృష్ణ , గొలుగూరి వెంకట్ రెడ్డి ఇద్దరూ సోదరులే కాకుండా చాలా కంపెనీల్లో డైరెక్టర్ గా వ్యాపారాలు చేస్తున్నారని ఆరోపించారు మన్నె క్రిశాంక్. గొలుగూరి వెంకట్ రెడ్డి మాక్సిబెన్ ఫార్మా కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నారని తెలిపారు.
గొలుగూరి కుటుంబీకులపై ఇప్పటికే ఎన్నో బ్యాంక్ ఎగవేత కేసులు ఉన్నాయని, వీటిని దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి అల్లుడి మాక్స్ బిన్ ఫార్మా ఆర్థిక లావాదేవీలపై విచారణ చేపట్టాలని ఈడీని కోరామని తెలిపారు మన్నె క్రిశాంక్. .