అమరుల త్యాగ ఫలితం తెలంగాణ రాష్ట్రం
మహబూబ్ నగర్ జిల్లా – బలిదానాలు, త్యాగాల వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని అన్నారు మాజీ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం దీక్షా దివస్ కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ నిర్వహించారు.
ఈ సందర్భంగా అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించారు మాజీ మంత్రి లక్ష్మా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. కేసీఆర్ గనుక పోరాటం చేసి ఉండక పోతే తెలంగాణ వచ్చి ఉండేది కాదన్నారు మాజీ మంత్రులు . పోరాటాలకు, ఉద్యమాలకు పెట్టింది పేరు తెలంగాణ అని అన్నారు.
దీక్షా దివస్ కు ప్రత్యేకమైన చరిత్ర ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అవమానాలు అన్నీ ఇన్నీ కాదన్నారు వి. శ్రీనివాస్ గౌడ్. అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేసి , తెలంగాణ పట్ల వివక్షను ప్రదర్శించిన తీరు దారుణమన్నారు.
ఆనాడు సబ్బండ వర్ణాలు కలిసి చేసిన ఉద్యమాలు, ఆందోళనల కారణంగానే తెలంగాణ కొత్త రాష్ట్రం
ఏర్పడిందన్నారు .