Wednesday, April 23, 2025
HomeNEWSబీఆర్ఎస్ కు భారీగా విరాళాలు

బీఆర్ఎస్ కు భారీగా విరాళాలు

మేఘా..య‌శోద‌..రామ్కీ..నాట్కో

హైద‌రాబాద్ – నిన్న‌టి దాకా నీతి సూత్రాలు వ‌ల్లిస్తూ వ‌చ్చిన భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి కోలుకోలేని రీతిలో దెబ్బ ప‌డింది. బీఆర్ఎస్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ , త‌దిత‌ర పార్టీల‌కు ఎల‌క్టోర‌ల్ బాండ్స్ పేరుతో భారీగా విరాళాలు అందాయి. వీటికి సంబంధించి బాండ్ల‌ను జారీ చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది సుప్రీంకోర్టు. వెంట‌నే సంస్థ‌లు, వ్య‌క్తులు ఎవ‌రెవ‌రు ఏయే పార్టీకి ఎన్నెన్ని నిధులు ఇచ్చారో వివ‌రాలు ఈసీలో న‌మోదు చేయాల‌ని ఆదేశించింది.

గ‌త కొంత కాలంగా పెద్ద ఎత్తున అవినీతి , అక్ర‌మాల ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్, ఆయ‌న కుటుంబంలోని కేటీఆర్, హ‌రీశ్ , క‌విత‌, సంతోష్ రావులు. మొత్తంగా ల‌క్ష కోట్ల‌కు పైగా వెన‌కేసుకున్న‌ట్లు విమ‌ర్శ‌లున్నాయి.

ఇదిలా ఉండ‌గా తాజాగా బ‌య‌ట ప‌డిన బాండ్ల వివ‌రాలు చూస్తే అంతా అనుకున్న‌ట్టుగానే మేఘా క‌న్ స్ట్ర‌క్ష‌న్ కంపెనీతో పాటు య‌శోద హాస్పిట‌ల్స్ యాజ‌మాన్యంతో పాటు ఫార్మా కంపెనీలు కూడా బీఆర్ఎస్ కు భారీ ఎత్తున విరాళాలు ఇచ్చాయి.

2014 నుంచి 2023 దాకా కొలువు తీరిన కేసీఆర్ స‌ర్కార్ క్రిడ్ ప్రో ను పాటించింది. మేఘా కృష్ణా రెడ్డికి చెందిన కంపెనీ కాళేశ్వ‌రం ప్రాజెక్టు చేప‌ట్టింది. కాలుష్య కార‌క నోటీసులు ఎదుర్కొంటున్న ఫార్మా కంపెనీలు కూడా ఉండ‌డం విశేషం.

ఇప్ప‌టి దాకా బీఆర్ఎస్ 1,332 కోట్లు అందుకుంది. వీటిలో మేఘా కంపెనీ రూ. 195 కోట్లు స‌మ‌ర్పించింది. య‌శోద సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ రూ. 94 కోట్లు ఇచ్చింది. రామ్ కీ గ్రూప్ కు చెందిన చెన్నై గ్రీన్ ఫుడ్స్ కంపెనీ రూ. 50 కోట్లు ఇచ్చింది. రెడ్డీస్ ల్యాబ్ రూ. 32 కోట్లు ఇస్తే హెటిరో డ్ర‌గ్స్ రూ. 30 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఇందుకు గాను హెటిరో సంస్థ చైర్మ‌న్ పార్థ సార‌థి రెడ్డికి రాజ్య‌స‌భ సీటు ఇచ్చింది.

ఇవే కాదు నాట్కో ఫార్మా, ఎంఎస్ ఎన్ ల్యాబ్స్ , అర‌బిందో ఫార్మా , హిండీస్ ల్యాబ్ , హాన‌ర్ ల్యాబ్ , హాజెలో ల్యాబ్ కంపెనీలు సైతం విరాళాలు స‌మ‌ర్పించాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments