కాంగ్రెస్ సర్కార్ బేకార్
రైతులను పట్టించుకోని సీఎం
నల్లగొండ జిల్లా – బీఆర్ఎస్ బాస్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళన బాట పట్టింది. రైతులకు మద్దతుగా నిరసన చేపట్టింది. నల్లగొండ జిల్లా మిర్యాల గూడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు రోడ్డు బాట పట్టారు.
కాంగ్రెస్ సర్కార్ రైతాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పాల్గొన్నారు. రైతులకు సంఘీభావం తెలిపారు. కనీస మద్దతు ధర కల్పించడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు భాస్కర్ రావు. వరి ధాన్యానికి క్వింటాలుకు రూ. 500 బోనస్ చెల్లిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి పత్తా లేకుండా పోయాడని ఎద్దేవా చేశారు. రైతులు పొద్దస్తమానం కష్ట పడి పండించిన పంట్టకు భరోసా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. రైతు రాజు అంటూ చిలుక పలుకులు పలికిన ప్రభుత్వం ఇప్పటికైనా తన తప్పు తెలుసుకుని ఆదుకోవాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే.