షకీల్ కేసులో 15 మందిపై కేసు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నిర్వాకం
హైదరాబాద్ – అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెట్రేగి పోయిన బోదన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కేసులో రోజు రోజుకు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకు ఏకంగా 15 మందికి ప్రమేయం ఉందని పోలీసు విచారణలో బయట పడింది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడైతే సీపీగా కొలువు తీరాడో ఆనాటి నుంచి షకీల్ కు , ఆయన తనయుడికి కష్టాలు మొదలయ్యాయి.
గత డిసెంబర్ నెలలో ప్రజా భవన్ వద్ద వాహనం ఢీకొన్న ఘటనలో వ్యక్తులను తారు మారు చేశారు. అక్కడి నుంచి జంప్ అయ్యాడు షకీల్ కొడుకు. తాజాగా తండ్రీ కొడుకులు పరారయ్యారు. తమ ఇంట్లో పని చేసే డ్రైవర్ ను ఇందులో పాల్గొన్నట్లు సృష్టించారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టిన సీపీ పలువురు పోలీస్ అధికారులపై వేటు వేశారు .
దీంతో వణుకు మొదలైంది. నిన్నటి దాకా తప్పించుకుని దుబాయి లోని ఓ ఫ్లాట్ లో దాచుకున్న తండ్రీ కొడుకులను గుర్తించారు పోలీసులు. ఈ మేరకు షకీల్ కొడుకు రహీల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా షకీల్ కొడుకు కేసులో ఏకంగా 15 మంది పోలీసులపై వేటు వేశారు సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి.