స్వచ్ బయో డీల్ పై ఈడీకి ఫిర్యాదు – క్రిశాంక్
సీఎం రేవంత్..తమ్ముడిపై విచారణ జరిపించాలి
ఢిల్లీ – బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మన్నె క్రిశాంక్ మంగళవారం ఢిల్లీలో ఈడీని కలిశారు. ఈ సందర్బంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు అనుముల జగదీశ్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. స్వచ్ బయో డీల్ పై విచారణ చేపట్టాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా సుదీర్ఘ ఫిర్యాదు పత్రాలను అందజేశారరు.
ఇటీవల అమెరికా పర్యటనలో స్వచ్ బయో తో ఒప్పందం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు మన్నె క్రిశాంత్. ఫిర్యాదు అనంతరం మన్నె మీడియాతో మాట్లాడారు. స్వచ్ బయో కంపెనీలో డైరెక్టర్ గా ఉన్న జగదీశ్ రెడ్డి, సీఎంపై విచారణ చేపట్టాలని కోరారు.
పూర్తి ఆధారాలను కూడా ఈడీకి సమర్పించడం జరిగిందని చెప్పారు మన్నె క్రిశాంక్. ఈడీ అధికారులు తాను ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించారని తెలిపారు. విచారణ చేపడతామని తనకు హామీ కూడా ఇచ్చారని చెప్పారు.
ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇందులో తప్పు ఏముంది అంటూ చెప్పారని, అందుకే తాము ఈడీకి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. జస్ట్ నెల కింద నమోదైన కంపెనీకి ఇన్ని డబ్బులు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు మన్నె క్రిశాంక్.