నిప్పులు చెరిగిన మాజీ మంత్రి
నాగర్ కర్నూల్ జిల్లా – కొల్లాపూర్ నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నాయకుడు శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. కొల్లాపూర్ లో హత్యా రాజకీయాలకు తెర లేపింది ప్రస్తుత మంత్రి జూపల్లి కృష్ణారావు అంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్.
గురువారం బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్యను నిరసిస్తూ చిన్నం బావి మండల కేంద్రంలో మృతదేహం తో పాటు పెద్ద సంఖ్యలో రాస్తారోకో చేపట్టారు. ర్యాలీగా మృత దేహాన్ని లక్ష్మిపల్లి గ్రామంకు తీసుకు వెళ్లారు.
వారితో పాటు పాల్గొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, అర్ఎస్ ప్రవీణ్ కుమార్.
జూపల్లి డౌన్ డౌన్, హత్య రాజకీయాలు మానుకోవాలి, నిందితులను వెంటనే శిక్షించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి నియోజకవర్గంలో.