ప్రభుత్వ సమావేశాల్లో కాంగ్రెస్ ఇంఛార్జ్
ప్రజా పాలన అంటే ఇదేనాన్న బీఆర్ఎస్
హైదరాబాద్ – రాష్ట్రంలో పాలన ఎటు పోతుందో తెలియడం లేదని నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాకేష్ రెడ్డి . ట్విట్టర్ వేదికగా శనివారం ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా రాచరిక పాలనను గుర్తు చేస్తోందని పేర్కొన్నారు.
పార్టీ పరంగా రాష్ట్ర ఇంఛార్జ్ పార్టీకి సంబంధించిన వ్యవహారాలను చూడాలే తప్పా ప్రభుత్వ పరంగా జరిగే అధికారిక కార్యక్రమాలలో ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేక అలా పాల్గొన్నారా అని ఎద్దేవా చేశారు. లేక పోతే ఇది కాంగ్రెస్ ఇటలీ మార్క్ పాలనా అని నిలదీశారు. యువరాజు ప్రతినిధి పర్యవేక్షణలో పాలన సాగాలని ఇలా చేస్తున్నారా అంటూ ఫైర్ అయ్యారు రాకేశ్ రెడ్డి.
ఒకవేళ ఢిల్లీ ప్రతినిధి లేకుండా ఏ నిర్ణయం తీసుకునే సత్తా లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు కోరుకున్న మార్పు ఇదేనా అని అన్నారు.