కాంగ్రెస్ పార్టీలోకి నేతల వలసలు
కండువా కప్పుకున్న ఎంపీ..టీటీడీ మాజీ మెంబర్
న్యూఢిల్లీ – త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీగా మారింది. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి సర్కార్ ను కూల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
దీనిని సీరియస్ గా తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు తానే స్వయంగా రంగంలోకి దిగారు. బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ నుంచి ప్రజా ప్రతినిధులు తమ పార్టీ వైపు చూసేలా చేస్తున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. మాజీ మంత్రి స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తాను పార్టీని వీడనున్నట్లు ప్రకటించారు. తాజాగా గులాబీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆయనతో పాటు కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఎంపీగా ఉన్న వెంకటేశ్ నేత జంప్ అయ్యారు. ఆయనతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ సభ్యుడు మన్నె జీవన్ రెడ్డి ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సారథ్యంలో కండువా కప్పుకున్నారు.