బీఆర్ఎస్ కు షాక్ కాంగ్రెస్ లోకి జంప్
ఝాన్సీ రెడ్డి సమక్షంలో చేరిక
పాలకుర్తి – మాజీ సీఎం కేసీఆర్ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితికి కోలుకోలేని షాక్ తగిలింది. ఒకరి వెంట మరొకరు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. మొన్నటికి మొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు చెందిన ముఖ్య అనుచరులు షాక్ ఇచ్చారు. తాము బీఆర్ఎస్ లో ఉండలేమంటూ ప్రకటించారు. వెంటనే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
తాజాగా పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ గా ఉన్న ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో తొర్రూరు పట్టణంలోని క్యాంపు ఆఫీసులో మున్సిపాలిటీలోని 16వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ అధ్యక్షులు మూల శ్రీనివాస్, బీసీ సెల్ అధ్యక్షులు మూల నాగయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా ఝాన్సి రాజేందర్ రెడ్డి మాట్లాడారు. కొత్తగా పార్టీలో చేరిన వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు, పార్టీలకు అతీతంగా తొర్రురు పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.. తమ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తోందని స్పష్టం చేశారు ఝాన్సీ రెడ్డి.