కాంగ్రెస్ లోకి గూడెం జంప్
క్యూ కడుతున్న గులాబీ ఎమ్మెల్యేలు
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ఆయన చెప్పినట్టుగానే, ఛాలెంజ్ చేసినట్టుగానే తన మాట నిలబెట్టుకుంటున్నారు. తను ఉన్నంత వరకు రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీని నామ రూపాలు లేకుండా చేస్తానంటూ ప్రకటించారు. ఆ మేరకు వర్కవుట్ చేశారు. ఇందులో వంద శాతం సక్సెస్ అయ్యారని చెప్పక తప్పదు.
నిన్నటి దాకా బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కేసీఆర్ ను, ఆయన కుటుంబాన్ని వెనకేసుకుంటూ వచ్చిన ప్రముఖ నాయకలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులంతా ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అంతే కాదు వరుస పెట్టి చేరేందుకు సీఎం రేవంత్ రెడ్డి నివాసం దగ్గర క్యూ కడుతున్నారు.
ఇదిలా ఉండగా అధికారంలోకి వచ్చిన వెంటనే సీరియస్ కామెంట్స్ చేశారు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు. కేవలం 3 నెలలు మాత్రమే రేవంత్ రెడ్డి సర్కార్ ఉంటుందని ఎద్దేవా చేశారు. ఇందులో కేటీఆర్, ఎంపీ లక్ష్మణ్ ఉన్నారు. దీనిని సీరియస్ గా తీసుకున్నారు సీఎం.
ఆ మేరకు ఆపరేషన్ ఆకర్ష్ కు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్ జిలానీలుగా మారారు. ఆరికెపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్ తో పాటు తాజాగా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జంప్ అయ్యారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రేపు ఇంకెవరు చేరుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.