మర్యాద పూర్వకంగానే కలిశానన్న యాదయ్య
హైదరాబాద్ – రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆయా పార్టీలకు చెందిన నేతలు పక్క చూపులు చూస్తున్నారు. నిన్నటి దాకా ఆధిపత్యం చెలాయిస్తూ ప్రజలను ముప్పు తిప్పలు పెట్టిన భారత రాష్ట్ర సమితి పార్టీకి రోజు రోజుకు కోలుకోలేని రీతిలో షాక్ లు తగులుతున్నాయి.
బీఆర్ఎస్ నుంచి ప్రధానంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి , మరికొందరు భారతీయ జనతా పార్టీలో జంప్ అవుతున్నారు. మరికొందరు కేవలం మర్యాద పూర్వకంగానే తాము సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకుంటున్నామని , పార్టీలో చేరేందు కోసం కాదని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల శాసనసభ నియోజకవర్గానికి చెందిన భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన శాసన సభ్యుడు కాలె యాదయ్య ఉన్నట్టుండి మంగళవారం సచివాలయంలో ప్రత్యక్షం అయ్యారు. ఆయన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తో పాటు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు.