NEWSTELANGANA

సీఎంను క‌లిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

Share it with your family & friends

మ‌ర్యాద పూర్వ‌కంగానే క‌లుసుకున్నా

హైద‌రాబాద్ – కాంగ్రెస్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ప్రారంభించిందా. అవున‌నే స‌మాధానం వ‌స్తోంది రాజ‌కీయ వ‌ర్గాల‌లో. కేవ‌లం ఆరు నెల‌ల్లోపే కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఉంటుంద‌ని, ఆ త‌ర్వాత తామే ప‌వ‌ర్ లోకి వ‌స్తామంటూ ప‌దే ప‌దే ప్ర‌కటిస్తూ వ‌చ్చిన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కోలుకోలేని షాక్ త‌గులుతోంది.

ఇప్ప‌టికే భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి చెందిన న‌లుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని ఆయ‌న నివాసంలో క‌లుసుకున్నారు. వారిలో సునీతా ల‌క్ష్మా రెడ్డి, గూడెం మ‌హిపాల్ రెడ్డి, మాణిక్ రావు, కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి ఉండ‌గా ఆదివారం మ‌రొక బీఆర్ఎస్ ఎమ్మెల్యే క‌లుసుకోవ‌డం గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది.

పైకి మ‌ర్యాద పూర్వ‌కంగానే అని బ‌య‌ట‌కు చెప్పిన‌ప్ప‌టికీ ఆయ‌న కూడా అధికార పార్టీలోకి జంప్ అవుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. న‌గ‌రంలోని రాజేంద్ర న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన శాస‌న స‌భ్యుడు ప్ర‌కాశ్ గౌడ్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డితో క‌లిసి రేవంత్ రెడ్డిని క‌లుసు కోవ‌డం ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది.