NEWSTELANGANA

బీఆర్ఎస్ కు షాక్ ఎమ్మెల్యే జంప్

Share it with your family & friends

కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్న ప్ర‌కాశ్ గౌడ్

హైద‌రాబాద్ – కేసీఆర్ సార‌థ్యంలోని బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని షాక్ త‌గిలింది. ఉన్న‌ట్టుండి ఆ పార్టీకి చెందిన రాజేంద్ర‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే వ‌న్నాడ ప్ర‌కాశ్ గౌడ్ రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు వేం న‌రేందర్ రెడ్డి తో క‌లిసి సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆ వెంట‌నే సీఎం కాంగ్రెస్ కండువాను క‌ప్పుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక బీఆర్ఎస్ బాస్ తో పాటు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ ఐటీ ,ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న ప‌దే ప‌దే సీఎం రేవంత్ రెడ్డిపై నోరు పారేసుకున్నారు. తాము త‌ల్చుకుంటే ఆరు నెల‌ల్లో ప్ర‌భుత్వం కూలి పోతుంద‌న్నారు. ఆ వెంట‌నే దానికి డెడ్ లైన్ కేవ‌లం కొంత కాలం మాత్ర‌మేన‌ని పేర్కొన్నారు.

దీన్ని సీరియ‌స్ గా తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. లండ‌న్ వేదిక‌గా జ‌రిగిన స‌మావేశంలో షాకింగ్ కామెంట్స్ చేశారు. 100 మీట‌ర్ల లోతు బీఆర్ఎస్ పార్టీని పాతి పెడతానంటూ ప్ర‌క‌టించారు. అంతే కాదు గులాబీ బాస్ ను అరెస్ట్ చేసేందుకు బోను సిద్దంగా ఉంద‌న్నారు సీఎం.