NEWSTELANGANA

దానంపై అన‌ర్హ‌త వేటు వేయాలి

Share it with your family & friends

స్పీక‌ర్ కు బీఆర్ఎస్ నేత‌ల ఫిర్యాదు

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ పార్టీ గుర్తుతో ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం నాగేంద‌ర్ ఉన్న‌ట్టుండి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. మ‌నోడు గ‌తంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. బీఆర్ఎస్ ప‌వ‌ర్ లోకి వ‌చ్చే స‌రికి కండువా క‌ప్పుకున్నాడు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఉద్య‌మ‌కారులు, విద్యార్థుల‌పై దాడికి పాల్ప‌డ్డారు.

అంతే కాదు ఆయ‌న‌పై ప‌లు అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కానీ నిన్న‌టి దాకా చిలుక ప‌లుకులు ప‌లికిన సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చారు. రాష్ట్రంలో మెరుగైన పాల‌న అందిస్తానంటూ న‌మ్మ బ‌లికి చివ‌ర‌కు లంగ‌లు, దొంగ‌లు, అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వారంద‌రీని పార్టీలోకి చేర్చు కోవ‌డంపై జ‌నం మండిప‌డుతున్నారు.

ఇదిలా ఉండ‌గా దానం నాగేంద‌ర్ పై సీరియ‌స్ అయ్యారు బీఆర్ఎస్ బాస్, మాజీ సీఎం కేసీఆర్. ఆయ‌న ఆదేశాల మ‌ర‌కు శాస‌న స‌భ‌లో బీఆర్ఎస్ శాస‌న స‌భ ప‌క్షం సోమ‌వారం స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ను క‌లిసింది. ఈ మేర‌కు వెంట‌నే దానం నాగేంద‌ర్ పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని కోరింది.