సీఎం దౌర్జన్యం బీఆర్ఎస్ ఆగ్రహం
భాష మార్చుకోక పోతే ఎలా
హైదరాబాద్ – రాష్ట్రంలో పోలీసు పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు. తమను అసెంబ్లీ లోపల మాట్లాడనీయకుండా అడ్డుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. విచిత్రం ఏమిటంటే తమను కూడా ప్రజలు నాయకులుగా ఎన్నుకున్నారని, తమకు శాసన సభలోకి వెళ్లేందుకు పూర్తి హక్కు ఉందన్నారు.
కావాలని తాము వెళ్లకుండా మార్షల్స్ అడ్డుకోవడం , బారికేడ్లను పెట్టడం ఎప్పుడూ చూడ లేదన్నారు హరీశ్ రావు, కేటీఆర్. ఎమ్మెల్యేలను అడ్డుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారంటూ మండిపడ్డారు కడియం శ్రీహరి. దీనిని పూర్తిగా ఖండిస్తున్నామని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గం పైకి నీతి మాటలు చెబుతూ కావాలని తమను మాట్లాడ నీయకుండా చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందన్నారు.
తమ 10 ఏళ్ల పాలనలో ఇలాంటి చర్యలు ఎప్పుడూ తీసుకోలేదని స్పష్టం చేశారు. అంతే కాదు ప్రతిపక్షాలు సైతం మీడియా పాయింట్ ను వాడుకున్నాయని, ఈ విషయం తెలుసుకుంటే మంచిదన్నారు కేటీఆర్, హరీశ్ , శ్రీహరి.