బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన ప్రదర్శన
క్షమాపణ చెప్పేంత దాకా పోరాడుతాం
హైదరాబాద్ – లగచర్ల బాధితులకు అండగా కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఆందోళన బాట పట్టారు. రైతులకు బేడీలు వేయడాన్ని నిరసిస్తూ ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేపట్టారు. ఇదేం రాజ్యం అంటూ నినాదాలు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి కావాలని చేస్తున్నారని, రాచరిక పాలన సాగిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. అన్నం పెట్టే అన్నదాతలను ఇబ్బందులకు గురి చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. లగచర్ల రైతులకు బేడీల విషయంలో చర్చ పెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.
రైతులకు బేడీలు వేయడం సిగ్గు చేటు అంటూ మండిపడ్డారు. శాసన సభ నుంచి బలవంతంగా ఎమ్మెల్యేలను బయటకు పంపించారు. పర్యాటక శాఖపై కాకుండా లగచర్ల సమస్యపై చర్చించాలని కోరారు. దీంతో సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.