ఎమ్మెల్సీ అభ్యర్థి అనుగుల రాకేశ్ రెడ్డి
ఖమ్మం జిల్లా – నల్లగొండ – వరంగల్ – ఖమ్మం జిల్లాల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అనుగుల రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు బంధ/ అడిగితే చెప్పుతో కొడతానన్న వాళ్లను తెలంగాణ రైతులంతా ఏకమై తిరగబడాలని పిలుపునిచ్చారు. ఓటు అనే ఆయుధంతో తిప్పి కొట్టాలని అన్నారు. అధికారం ఉంది కదా అనే అహంకారం తల కెక్కితే చివరకు భూ స్థాపితం కాక తప్పదన్నారు రాకేశ్ రెడ్డి.
ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమైనదని చెప్పారు. ఓటు ప్రజాస్వామ్యానికి మూల స్తంభం లాంటిదని పేర్కొన్నారు. ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. సమర్థవంతులైన నాయకులను ఎన్నుకుంటేనే భవిష్యత్తు బాగుంటుందన్నారు. లేక పోతే ఇబ్బందులు తప్పవన్నారు.
చదువుకున్న వారిని, విద్య విలువ తెలిసిన వారిని గుర్తించాలని లేక పోతే భవిష్యత్తు అంధకారం కాక తప్పదన్నారు అనుగుల రాకేష్ రెడ్డి. కుల, మతాలు, ప్రాంతాలకు అతీతంగా తనకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. ఈ ప్రాంతపు సమస్యల పట్ల తనకు అవగాహన ఉందన్నారు . మీ వాయిస్ వినిపించాలంటే తనకు ఓటు వేయాలన్నారు.