బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా
ఎంపికపై గులాబీ బాస్ కసరత్తు
హైదరాబాద్ – రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఆరుగురు ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసింది. సిట్టింగ్ లలో ముగ్గురికి ఛాన్స్ ఇచ్చింది. వీరిలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ ,ధర్మపురి అర్వింద్ లను ఎంపిక చేసింది. ఇంకా 11 మందిని ప్రకటించాల్సి ఉంది.
ఇదిలా ఉండగా సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆయా లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు సమాచారం. ఖమ్మం ఎంపీ స్థానానికి నామా నాగేశ్వర్ రావు, చేవెళ్ల నుండి గడ్డం రంజిత్ రెడ్డి, జహీరాబాద్ నుంచి భీమ్ రావు బసంతరావు పాటిల్ , కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్ లకు ఛాన్స్ ఇచ్చింది.
ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి ఆత్రం సక్కు, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్దన్ , మల్కాజ్ గిరి నుంచి భద్రా రెడ్డి, సికింద్రాబాద్ నుంచి తలసాని సాయి కిరణ్ యాదవ్ , నల్గొండ నుంచి గుత్తా అమిత్ రెడ్డి లేదా చిన్నప రెడ్డి, భువనగిరి నుంచి పైళ్ల శేఖర్ రెడ్డి లేదా జిట్టా బాలకృష్ణ రెడ్డి లేదా దూదిమెట్ల బాల్ రాజ్ యాదవ్ లేదా గుత్తా అమిత్ రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
పెద్దపల్లి ఎంపీ స్థానానికి కొప్పుల ఈశ్వర్ లేదా బాల్క సుమన్ , మెదక్ నుంచి వంటేరు ప్రతాప్ రెడ్డి లేదా చిలుముల మదన్ రెడ్డి, వరంగల్ నుంచి కడియం కావ్య లేదా ఆరూరి రమేష్ లేదా ఎర్రోళ్ల శ్రీనివాస్ లేదా పి. దయాకర్ ను ఎంపిక చేసింది బీఆర్ఎస్ . మహబూబాబాద్ నుంచి సీతారం నాయక్ లేదా రెడ్యానాయక్ లేదా మాలోతు కవిత, మహబూబ్ నగర్ నుంచి చర్లకోల లక్ష్మా రెడ్డి లేదా వి. శ్రీనివాస్ గౌడ్ లేదా ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి పోతుగంటి రాములును ఎంపిక చేయనుంది బీఆర్ఎస్.