వరద బాధితులకు బీఆర్ఎస్ ఆసరా
సరుకులు పంపిణీ చేసిన ఎంపీ వ
ఖమ్మం జిల్లా – భారీ వర్షాలు, వరద కారణంగా నష్ట పోయిన బాధితులకు భరోసా కల్పించే ప్రయత్నం చేసింది భారత రాష్ట్ర సమితి పార్టీ. ప్రధానంగా ఖమ్మం జిల్లాను వర్షాలు కక్ష కట్టాయి. ఎక్కడ చూసినా నీళ్లు కనిపిస్తున్నాయి.
వరదల దెబ్బకు వంతెనలు, రోడ్లు దెబ్బ తిన్నాయి. చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మానవతను చాటుకున్నారు.
జిల్లాకు చెందిన బాధితులకు పునరావాసం కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. ఇదే సమయంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఆహారాన్ని, పండ్లను అందజేసేలా చర్యలు తీసుకున్నారు.
మున్నేరు వరదల వల్ల ఇండ్లల్లో బురద నిండిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న వరద బాధితులకు బియ్యం, కందిపప్పు, ఉల్లిపాయలు, ఆలుగడ్డలు, మంచి నూనె, కూరగాయలు పంపిణీ చేశారు బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర .
ఈ సందర్బంగా కష్ట సమయంలో సర్వస్వం కోల్పోయిన బాధితులకు అండగా నిలిచిన తమ పార్టీకి చెందిన ఎంపీని ప్రత్యేకంగా అభినందించారు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు.