బీఆర్ఎస్ నేతలు జంప్
కాంగ్రెస్..బీజేపీ లోకి వలసలు
హైదరాబాద్ – ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయా పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు జంప్ జిలానీలుగా మారి పోయారు. కొందరు రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే మరికొందరు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వైపు చూస్తున్నారు.
ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు మంత్రిగా , ప్రస్తుతం ఎంపీగా ఉన్న పోతుగంటి రాములు గులాబీ జెండాను వీడారు. ఆయన తనయుడు ప్రస్తుతం జెడ్పీటీసీగా ఉన్నారు. భరత్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
వలసలా లేక తాత్కాలిక ఫిరాయింపులా అనేది తెలియడం లేదు. భారీ ఆదాయం కలిగిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత హస్తం గూటికి చేరారు.
మాజీ మేయర్ తీగల కృష్ణా రెడ్డి , ఆన భార్య కూడా జంప్ అయ్యారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక బీఆర్ఎస్ కు చెందిన మరో వికెట్ కోల్పోయింది. డిప్యూటీ మేయర్ గా ఉన్న మోతె శ్రీలత శోభన్ రెడ్డి తన భర్త శోభన్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.