ప్రకటించిన గులాబీ బాస్ కేసీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ కుమార్ ను ఖరారు చేశారు. ఈ మేరకు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఎన్నో పదవులను నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. ఉద్యమకారుడిగా, మేధావిగా, నాయకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు దాసోజు శ్రవణ్. ప్రజల తరపున గొంతుకగా ఉన్నారు. ప్రజా సమస్యలను ఎత్తి చూపడంలో , ప్రభుత్వాలను ప్రశ్నించడంలో ముందున్నారు. సోమవారం దాసోజు శ్రవణ్ కుమార్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక , టెక్నాలజీ రంగాలపై మంచి పట్టుంది దాసోజు శ్రవణ్ కుమార్ కు. ఆయన విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. అనుకోకుండా పార్టీలు మారినా జనం వాయిస్ వినిపిస్తూనే వచ్చారు. ప్రజా రాజ్యంలో కీలక భూమిక పోషించారు. అనంతరం కేసీఆర్ కు కుడి భుజంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. జాతీయ స్థాయిలో కీలకమైన నేతగా ఎదిగారు.
ఇటీవల జరిగిన ఎన్నికల కంటే ముందు బీజేపీలో చేరి..తిరిగి గులాబీ గూటికి చేరారు. ఎంతో మంది ఎమ్మెల్సీ సీటు కోసం పోటీ పడ్డారు. చివరకు గులాబీ బాస్ మాత్రం తను ప్రేమించే శ్రవణ్ కు ఛాన్స్ ఇచ్చారు. తమ ప్రభుత్వ హయాంలో గవర్నర్ కోటా కింద తన పేరు పంపించినా తమిళసై ఒప్పుకోలేదు. దీంతో ఎమ్మెల్సీ అయ్యే ఛాన్స్ మిస్ అయ్యారు దాసోజు. ఇప్పుడు ఆయనను లక్ వరించిందని చెప్పక తప్పదు.