రైతు కుటుంబానికి బీఆర్ఎస్ భరోసా
ఇదేనా ప్రజా పాలన..సింగిరెడ్డి..పల్లా
ఖమ్మం జిల్లా – ప్రజా పాలన పేరుతో దాష్టిక పాలన కొనసాగిస్తున్నారంటూ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించారు. వారికి భరోసా కల్పించేందుకు ప్రయత్నం చేశారు.
ఎవరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడ వద్దని ఈ సందర్బంగా కోరారు. కాంగ్రెస్ పార్టీ ఆచరణకు నోచుకోని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ప్రజలు మోస పోయారని, మోసం చేయడం ఆ పార్టీ డీఎన్ఏలోనే ఉందని ఆరోపించారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి.
ఈ సందర్బంగా రైతు కుటుంబానికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఆర్థిక సాయం పార్టీ తరపున అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ,ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మధు , పార్టీ సీనియర్ నాయకుడు అనుగుల రాకేష్ రెడ్డి, ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు.