కోర్టు చీవాట్లు పెట్టినా మారక పోతే ఎలా..?
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ ఫైర్
హైదరాబాద్ – రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్దం తారా స్తాయికి చేరింది. బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా అన్నీ మేం చేస్తే ఇక నువ్వు ఎందుకు సీఎంగా ఉండడం అంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ట్వీట్ చేసింది. దీనిపై సంచలన వ్యాఖ్యలు చేసింది కాంగ్రెస్ పార్టీ .
దీనిపై తీవ్రంగా స్పందించింది బీఆర్ఎస్ పార్టీ. సభ్యత గురించి రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుందంటూ ఎద్దేవా చేసింది.
ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ను నానా మాటలు అన్నది మీ రేవంత్ రెడ్డి కాదా అంటూ ప్రశ్నించింది. ముందు మీ రేవంత్‌ను ముఖ్యమంత్రిలా వ్యవహరించమని చెప్పండి అంటూ హితవు పలికింది. .
మీ పార్టీ సోషల్ మీడియా జోకర్లకు తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడి, తొలి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కు మర్యాద ఇచ్చి మాట్లాడమని చెప్పాంటూ సూచించింది బీఆర్ఎస్ పార్టీ.
రెండు రోజుల క్రితం ఇదే విషయంపై సుప్రీం కోర్టు మీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద అక్షింతలు వేసినా, మీకు ఇంకా బుద్ధి రావడం లేదంటూ పేర్కొంది. సీఎం తన స్థాయి మరిచి పోయి మాట్లాడటం పట్ల సుప్రీంకోర్టు సైతం సీరియస్ అయినా ఇంకా మారక పోతే ఎలా అని ప్రశ్నించింది.