కరెంట్ ఇస్తే నోటీసులా
నిలదీసిన బీఆర్ఎస్ పార్టీ
హైదరాబాద్ – కాంగ్రెస్ రేవంత్ సర్కార్ కావాలని కక్ష కట్టి మాజీ సీఎం కేసీఆర్ ను బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తోందంటూ ఆరోపించింది భారత రాష్ట్ర సమితి పార్టీ (బీఆర్ఎస్). శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడం జరిగిందని తెలిపింది. ఇందుకు సంబంధించి రూల్స్ ప్రకారమే ఛత్తీస్ గఢ్ సర్కార్ తో ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొంది.
రాష్ట్రంలో కరెంట్ కోతలకు చెక్ పెట్టిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని తెలిపింది. కేసీఆర్ కంటే ముందు పరిపాలించిన సీఎంలు ఇవ్వలేక పోయారని గుర్తు చేసింది బీఆర్ఎస్. ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డికి కూడా చేత కావడం లేదంటూ ఎద్దేవా చేసింది.
దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వలేని రీతిలో కరెంట్ సరఫరా ఇచ్చిన ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేసింది. నోటీసులు, కేసుల పేరుతో తమ నాయకులను ఇబ్బంది పెట్టే పని చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది బీఆర్ఎస్.