బీఆర్ఎస్ కు షాక్ ఎంపీ జంప్
మాజీ టీటీడీ బోర్డు మెంబర్ కూడా
న్యూఢిల్లీ – లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళ మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని భారత రాష్ట్ర సమితి పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఊహించని రీతిలో షాక్ ఇచ్చారు. ఇప్పటికే గులాబీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపై తాను పార్టీనీ విడుతున్నట్లు ప్రకటించారు. తనకు ఆ పార్టీలో సరైన ప్రాధాన్యత లభించడం లేదన్నారు.
తాజాగా ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సారథ్యంలో బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ తో పాటు పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ ఫార్మా వ్యాపారవేత్త టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు మన్నె జీవన్ రెడ్డి జంప్ అయ్యారు.
వెంకటేష్ తో పాటు జీవన్ రెడ్డి మంగళవారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో గులాబీ పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పక తప్పదు. ఆరు నెలల్లో ప్రభుత్వాన్ని పడగొడతామని తొడ గొట్టి చెప్పిన కేటీఆర్ కు గూబ గుయ్ మనిపించేలా చేశారు సీఎం రేవంత్ రెడ్డి.