సర్కార్ పై యుద్దం ధర్నాకు సిద్దం – కేటీఆర్
రైతు భరోసా ఇవ్వనందుకు పిలుపు
హైదరాబాద్ – కాంగ్రెస్ సర్కార్ పై బీఆర్ఎస్ యుద్దం ప్రకటించింది. ఇప్పటికే వివిధ అంశాలపై తన వాయిస్ వినిపిస్తోంది. ఎక్కడా తగ్గడం లేదు. ప్రతిపక్ష పాత్రను పోషిస్తోంది. అటు నిరుద్యోగులు, ఇటు ఆశావహులతో పాటు జాబ్స్ భర్తీ విషయంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న నిర్లక్ష్యాన్ని, వివక్షను ప్రశ్నిస్తోంది.
అంతే కాకుండా ఆరుగాలం శ్రమించే రైతన్నలను దగా చేసిన విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. ఈ మేరకు ఆయన ప్రాజెక్టుల విషయంలో పూర్తిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అర్థం చేయించేందుకు ప్రయత్నం చేశారు.
ఇదే సమయంలో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ విషయంలో జీవో 29ను రద్దు చేయాలని కోరారు. కాగా తాజాగా రైతులకు ఇవ్వాల్సిన వర్షాకాల రైతు భరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ , రైతులను ఆదుకోవాలని కోరుతూ అక్టోబర్ 20న ఆదివారం అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు కేటీఆర్.
పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, వివిధ విభాగాల అధిపతులు , రైతు నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని, కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న మోసాన్ని ఎండగట్టాలని కోరారు.