నేడే బీఎస్పీ మహా ధర్నా
ఆత్మహత్యలకు నిరసనగా
హైదరాబాద్ – రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థినులు ఆత్మహత్యలకు పాల్పడడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. మృతుల కుటుంబాలు ఆందోళనలు, నిరసన వ్యక్తం చేసినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకుండా పోయింది.
ఈ వైఖరిని నిరసిస్తూ పేద పిల్లలు చదువుకు దూరమయ్యేలా ఇలాంటి ఘటనలు ప్రేరేపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయన బాధిత పేరెంట్స్ కు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి కానీ, సంబంధిత ప్రజా ప్రతినిధులు కానీ అసెంబ్లీలో చర్చించక పోవడం దారుణమన్నారు. ఇది అత్యంత అమానవీయమని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్ఎస్పీ. ఇందులో భాగంగా సర్కార్ వైఖరిని ఎండగడుతూ ఈనెల 12న సోమవారం హైదరాబాద్ లోని మాసాబ్ ట్యాంక్ వద్ద బీఎస్పీ ఆధ్వర్యంలో మహా ధర్నా చేపట్టనున్నట్లు ప్రకటించారు .