వైఎస్ ఫ్యామిలీ భూ కబ్జాలను నిరూపిస్తాం
టీడీపీ సీనియర్ నేత బీటెక్ రవి ఛాలెంట్
అమరావతి – తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బీటెక్ రవి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. వైసీపీ ఫ్యామిలీ చేసిన భూ కబ్జాలపై భగ్గుమన్నారు. విచిత్రం ఏమిటంటే పులివెందులలో టీడీపీ నేతలు కబ్జాలు చేస్తున్నారని ఆర్డీవోకు ఎంపీ అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు బీటెక్ రవి. ఆయన చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్దమన్నారు.
తొండూరు మండలంలో వైఎస్ ఫ్యామిలికి చెందిన వ్యక్తి 200 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని మండిపడ్డారు. విచిత్రం ఏమిటంటే రూ.50 వేలతో కొన్నట్లు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. ప్రభుత్వ భూమిని అమ్మిన వ్యక్తిపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు బీటెక్ రవి.
అంతే కాదు అవినాష్ పీఏ రాఘవరెడ్డి ఫారెస్ట్ ల్యాండ్ ను ఆక్రమించాడని ధ్వజమెత్తారు. అంబకపల్లెలో ఫారెస్ట్ ల్యాండ్ ను సాగు చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు . భూ ఆక్రమణలపై రెవెన్యూ మంత్రికి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు టీడీపీ నేత బీటెక్ రవి.
ఇదే కాకుండా ఇంకా చాలా చోట్ల అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ ఫ్యామిలీ కబ్జాలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటిపై వెంటనే విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు.