రాజమండ్రి రూరల్ మాదే
కాదంటే ఊరుకోమన్న చౌదరి
అమరావతి – ఏపీలో టికెట్ల పంచాయతీ ఇంకా కొలిక్కి రాలేదు టీడీపీ, జనసేన పార్టీల మధ్య . జనసేనతో పాటు మరో పార్టీ బీజేపీ కూడా చేరింది. ఒక్క జగన్ మోహన్ రెడ్డిని ఢీకొట్టేందుకు, ఆయనను ఇంటికి సాగనంపేందుకు నానా తంటాలు పడుతున్నాయి ప్రతిపక్షాలు.
తనకంటూ ఎదురే లేదని ధీమాతో ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు జైలు అంటే ఏమిటో చూపించారు జగన్ రెడ్డి . బెయిల్ ఇచ్చేందుకు కూడా ఏసీబీ కోర్టు తిరస్కరించింది.
ఇదే సమయంలో నానా తంటాలు పడి ఎలాగో చంద్రబాబు బెయిల్ పై బయటకు వచ్చారు. ఈసారి తన పంథం నెగ్గించుకునేలా ప్లాన్ చేశారు. గతంలో దోస్తీ చేసి చివరకు కాంగ్రెస్ తో జత కట్టి మళ్లీ కాషాయం పంచన చేరారు. ఇదంతా కేవలం అధికారం కోసమేనని అంటే టీడీపీ శ్రేణులు ఒప్పుకోవు.
దానికి అందమైన పేరు పెట్టారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము కమలంతో కలుస్తున్నామని. ఇది పక్కన పెడితే తాజాగా టీడీపీ వర్సెస్ జనసేన గా మారి పోయింది. టికెట్లకు సంబంధించి ఇరు పార్టీలు పట్టు పడుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరు నూరైనా సరే రాజమండ్రి రూరల్ తమదేనంటూ స్పష్టం చేశారు.