బుద్దా వెంకన్న షాకింగ్ కామెంట్స్
అమరావతి – టీడీపీ సీనియర్ నాయకుడు బుద్దా వెంకన్న షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా ఇంకా జగన్ మోహన్ రెడ్డికి, ఆయన పరివారానికి బుద్ది రాలేదన్నారు. ఇప్పటికే అధికారాన్ని అడ్డం పెట్టుకుని 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడని ఆరోపించారు. అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.
అసలు మాజీ మంత్రి పేర్ని నానికి శ్వేత పత్రం అంటే ఏమిటో తెలుసా అని ప్రశ్నించారు. ఎప్పుడైనా వైసిపి వాళ్లు శ్వేత పత్రాలు విడుదల చేశారా అని మండిపడ్డారు. తాము వచ్చాక అన్నింటిని సక్రమ పద్దతిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక స్పీడ్ పెంచారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును ఎలాగైనా సరే పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారని అన్నారు. ఇప్పటికే ఏపీని ఆదుకోవాలంటే కనీసం లక్ష కోట్ల రూపాయలు కావాల్సి ఉందన్నారు.
వైసీపీ పాలనలో దోచు కోవడం దాచు కోవడం తప్పా చేసింది ఏమీ లేదన్నారు బుద్దా వెంకన్న.